తాంసీ,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్
జిల్లాలోని తాంసీ ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో శుక్రవారం నాడు కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని మండల పరిషత్ అధ్యక్షులు
మంజుల శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిషత్
సభ్యులు రాజు ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్
శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ ప్రాథమిక
ఆరోగ్య కేంద్రంలో తీసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు కరోనా వ్యాధి రాకుండా
ఉండాలంటే సామాజిక దూరం మాస్కులు తప్పనిసరి ధరించాలని తెలిపారు. కరోనా వ్యాధి
వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇందుకు ప్రతి ఒక్కరు నియమ నిబంధనలను అనుసరించాలని
సూచించారు. అనంతరం అడిషనల్ డిఎంఅండ్హెచ్ఓ
మరియు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ,జిల్లా లెప్రసీ ఎయిడ్స్
అధికారి ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ)
మొదలు వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా వేస్తారు. మరో వెయ్యి ప్రైవేటు
ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. మొత్తం రోజుకు లక్షకు తగ్గకుండా
లబ్ధిదారులకు టీకా వేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45-59 ఏళ్ల మధ్య
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేస్తున్న మన్నారు. కేంద్రం కొన్ని సవరణలు చేసి 45-59 ఏళ్ల వారిలో
దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా వారందరికీ టీకాలు వేస్తామణి అయన ఈ సందర్భంగా
తెలిపినారు.వచ్చే నెల 1 నుంచి వైద్యుల నుంచి ఎలాంటి ధ్రువీకరణ పత్రం
లేకుండానే, వారి వయసును
తెలిపే గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుందని, అర్హులైన వారందరూ కోవిడ్ వ్యాక్సిన్
తీసుకోవాలని ఆయన సూచించారు వ్యాక్సింగ్ తీసుకోవడం వల్ల ఎలాంటి అపాయాలు ఉండవని
ప్రజల్లో ఒక వదంతులు మాత్రమే ఉన్నాయన్నారు వీటిని తొలగించి వ్యాక్సిన్ తీసుకోవాలని
ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు ప్రాథమిక ఆరోగ్య
కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.