స్టాఫ్‌‌నర్స్‌ పోస్టు‌లకు వెబ్‌ ఆప్షన్లు

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

హైద‌రా‌బాద్,(ఆరోగ్యజ్యోతి): స్టాఫ్‌‌నర్స్‌ పోస్టు‌లకు ఎంపి‌కైన అభ్య‌ర్థులు ఈ నెల 6, 7 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చు‌కో‌వా‌లని టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ సూచిం‌చింది. గతంలో ఇచ్చిన వెబ్‌ ఆప్ష‌న్లల్లో చాలా‌మంది పొర‌పాట్లు చేయ‌డంతో మ‌రోసారి  అవ‌కాశం క‌ల్పించి‌నట్టు అధికారులు పేర్కొ‌న్నారు. ఆప్షన్లు ఇచ్చే క్రమంలో జోన్‌, డిపా‌ర్ట్‌‌మెం‌ట్‌ను స్పష్టంగా పేర్కొ‌నా‌లని సూచించారు. ఇది గతంలో ఇచ్చిన వెబ్‌ ఆప్ష‌న్లను ఎడిట్‌ చేసు‌కొనే అవ‌కాశం మాత్ర‌మే‌నని, ఇప్పుడు సమ‌ర్పించే వెబ్‌‌ఆ‌ప్ష‌న్లను మార్చే అవ‌కాశం ఉండ‌దని స్పష్టం‌చే‌శారు.