పీహెచ్‌సీని సందర్శించిన డిఫ్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)


రాజానగరం, (ఆరోగ్యజ్యోతి):వైద్య ఆరోగ్యశాఖ డిఫ్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ వై.కోమలి రాజానగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా పీహెచ్‌సీలోని పలు విభాగాల పనితీరుతోపాటు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొవిడ్‌ అనుమానంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో సిటీ స్కానింగ్‌ చేయించుకున్న వారు సంబంధిత వివరాలను ఆయా ప్రాంతాల పరిధిలోని అధికారులకు తెలియజేయాలని ఆదేశించామన్నారు. జిల్లాలో మళ్లీ కొవిడ్‌ అనుమానిత కేసులు నమోదవుతున్నందున ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు.గ్రామాల్లో జరిగే ఉత్సవాలకైనా, పండుగలకైనా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా నిర్మూలనకు సహకరించాలన్నారు.