కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
· తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): 2018 మే 16 న గౌరవ ముఖ్యమంత్రి
గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గత రెండున్నరేళ్ళుగా తెలంగాణ ఎంప్లాయిస్
అసోసియేషన్ మరియు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన నిరంతర పోరాటాల తెలంగాణ
ఎంప్లాయిస్ అసోసియేషన్(టిఈఏ) రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర
అధ్యక్షులు సిహెచ్ సంపత్ కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు డా.జి
నిర్మల, గడ్డం బాలస్వామి కోశాధికారి, ఆనంద్ యాదవ్, శైఫా బేగం, రాజేశ్వరి, దేవకి, మల్లేశం, సుజాతముఖ్యమంత్రి ప్రకటనను
తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్వాగతిస్తున్నదని అన్నారు.ఈ సందర్భంగా వారు
మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్
వయసు 61 సంవత్సరాలకు పెంపు, పదోన్నతులు, ప్రాథమిక పాఠశాలల్లో
ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరు, పెన్షనర్లకు 70 ఏళ్ళకే 15% క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంపు, కాంట్రాక్టు ఉద్యోగులకు
వేతనాల పెంపు, మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవుల వర్తింపును
తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్వాగతిస్తున్నది.పిఆర్సీ ని 1.07.2018 నుండే అమలు
చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది. ఇంటి అద్దె
అలవెన్సును ప్రస్తుతం అమలులో ఉన్న
శ్లాబులనే కొనసాగించాలని అన్నారు.12 నెలల బకాయిలను రిటైర్మెంట్ సందర్భంలో ఇస్తామని
ముఖ్యమంత్రి పేర్కొనటం చాలా విచారకర మైన విషయం అన్నారు. పీఆర్సీ బకాయిలను విడతల
వారీగా అయినా సరే ఇప్పుడే ఇవ్వాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కోరుతుందన్నారు.
కెజిబివి, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం బేసిక్ పే ఇవ్వాలని,సిపిఎస్ రద్దు చేయాలని వారు
కోరినారు. ఉద్యోగుల నియామక ప్రక్రియ ముందుగానే పూర్తై 1.09.2004
తర్వాత నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తిపజేయాలని, తెలంగాణ ఎంప్లాయిస్
అసోసియేషన్ డిమాండ్ చేస్తుదన్నారు.