కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఏపీ గవర్నర్ దంపతులు

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

విజయవాడ,(ఆరోగ్యజ్యోతి):  రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ దంపతులు  మూడవ దశలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ కరోనా కోవాక్సిన్ తీసుకున్నానని...అసలు ఇంజక్షన్ తీసుకున్నట్టే లేదని తెలిపారు. కరోనాను నియంత్రించడానికి వైద్య సిబంది ఎంతో కష్టపడుతున్నారన్నారు. కరోనాకు ప్రపంచమే వణికిపోయిన సందర్భాన్ని చూసామని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బాగానే ఉన్నట్లు చెప్పారు. అందరూ వాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటున్నానన్నారు. రెండో డోసు మార్చ్ 30 తర్వాత తీసుకోవాలని వైద్యులు సూచించారని గవర్నర్ హరిచందన్ తెలిపారు.