కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాల్లో
ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్
వాకాటి కరుణ శనివారం నాడు కో - చైర్మన్ రామ రాజేష్ కన్నా ఆధ్వర్యంలో వినతి పత్రం
సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 510 జీవో లో 13 వేల మంది పని
చేస్తున్నారని ఇందులో తొమ్మిది వేల మందికి వేతనాలు పెంచాలని మరో 4 వేల మందికి
వేతనాలు పెంచలేదని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు, మూడు సంవత్సరాల
నుండి నాలుగు వేల మంది సిబ్బందికి వేతనాలు పెంచండి కారణంగా పూట గడవని పరిస్థితి లో
కూడా కొందరు ఉద్యోగులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తొమ్మిది వేల
మందికి పెంచిన విధంగానే అదే జీవో ప్రకారం 4వేల మందికి పెంచాలని ఆయన కమిషనర్ను
కోరారు. ఈ కార్యక్రమంలో
అర్.ఎన్.టీ.సి.పీ ప్రెసిడెంట్ స్టేట్ శ్రవణ్ కుమార్, స్టాఫ్ నర్స్ వైస్ ప్రెసిడెంట్ కరీహీం వైస్
ప్రెసిడెంట్ రహీం, జాయింట్ సెక్రటరీ
ఏకుల చిరంజీవి, రాష్ట్ర
ఉపాధ్యక్షుడు వెంకటేష్, ఉపాధ్యక్షుడు
ఏ.విజయ్ నాయక, వైస్ ప్రెసిడెంట్
పీ. దిలీప్ కుమార్, జిల్లా
కార్యదర్శి అశోక్, శ్రీధర్ నేషనల్
హెల్త్ మిషన్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.