జిల్లాలకు కొత్త జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇతర అధికారుల నియామకం

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)


హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, వివిధ ఆస్పత్రిలో ఆర్ఎంఓ లతో పాటు వివిధ కేతగిరిల్లో ఖాళీలను పోస్టులను భర్తీ  చేస్తూ  శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ బోసిగారి  రెడ్డి కుమారిని జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్ కు, డాక్టర్ ఐ ఏ సరళ కుమారిని జాయింట్  డైరెక్టర్ (ఎం.ఇ) కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ కు నియమించారు. డాక్టర్ శ్రీనివాసులు జాయింట్  డైరెక్టర్(టిఆర్ జీఎస్)  కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ కు నియమించారు.

 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు...

డాక్టర్  కొడవలూరు  కృష్ణ ని  ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే  డాక్టర్ అన్నిమల్ల  కొండలరావును  నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా, డాక్టర్ లక్ష్మన్ సింగ్ ను నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా,డాక్టర్ కొప్పుల వెంకట సత్యనగా కృష్ణ ను వరంగల్ అర్బన్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా, డాక్టర్ అత్తి జయలక్ష్మిని  కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా నియమించారు. డాక్టర్ జుమ్మడి వెంకట్ ని   హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా. డాక్టర్ మాలతి ని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా నియమించారు.

 

అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ...

డాక్టర్ కే.సుధాకర్ లాల్ అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగర్ కర్నూల్ జిల్లాకు నియమించాగా  డాక్టర్ అంగడి బాల నరేందర్ ని భద్రాచలం అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా, డాక్టర్ డి  తుకారాంను కామారెడ్డి  అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా, డాక్టర్ మొహమ్మద్ నిరంజన్ను వికారాబాద్ అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమించారు. డాక్టర్ బాలుసు  వెంకటేశ్వరరావును మెదక్ అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నియమించారు. డాక్టర్ కోటచలం ను సూర్యాపేట అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కు నియమించగా, డాక్టర్ ప్రమోద్ కుమార్ ను  జగిత్యాలగా అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమించారు.

సిఎస్ ఆర్ఎంఒలు ...

 డాక్టర్ కే  జ్యోతిని  సిఎస్ ఆర్ఎంఒ నిలోఫర్ హాస్పిటల్ నియమించారు.అలాగే .డాక్టర్ మనోహర్ ను సిఎస్ ఆర్ఎంఒ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ హైదరాబాద్ జగిత్యాల కు  నియమించారు. డాక్టర్ పి చంద్రశేఖర్ సిఎస్ ఆర్ఎంఒ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిద్దిపేట కు నియమించారు. అలాగే డాక్టర్ జరుపుల సునీల్ కుమార్ ని  వరంగల్ జోనల్ మలేరియా అధికారి గా నియమించారు.