మాస్క్ ధరించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

గంపలగూడెం, కృష్ణా జిల్లా (ఆరోగ్య జ్యోతి) :కరోనా వైరస్ రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ రోజురాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ ఉత్తర్వుల మేరకు, జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్  ఆదేశాల పై, నూజివీడు డిఎస్పి శ్రీనివాసులు  గంపలగూడెం మండలం, నెమలి గ్రామములోని శాండ్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీ చేసి, మాస్క్ లేనివారికి మాస్క్ లు పంపిణీ చేసి, మాస్క్ వాడకం గురించి అవగాహన కల్పించారు .ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించి కరోనా వైరస్ను అంతం చేయాలని అవగాహన కల్పిస్తున్నారు .ఈ కార్యక్రమములో తిరువూరు సిఐ శేఖర్ బాబు , గంపలగూడెం ఎస్ ఐ  సతీష్  తదితరులు పాల్గొన్నారు