సరైన ఆహారంతీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

-       సిడిపిఓ తిరుమల దేవి

కోరుట్ల,(ఆరోగ్య జ్యోతి): మనిషి సరయిన ఆహారం తీసుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలరని సిడిపిఓ తిరుమల దేవి అన్నారు . పోషణ కార్యక్రమంలో భాగంగా బోయవాడ అంగన్వాడీ కేంద్రంలో మహిళా సంఘాల సభ్యులతోశనివారం  సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషకాహార లోపం వల్ల అనేక రకాల వ్యాధులు మనిషిని పీడిస్తాయి అన్నారు. శరీరంలో కావలసినంత ఐరన్ లేకపోవడం వల్ల రక్తహీనత క్యాల్షియం లేకపోవడం వల్ల ఎముకల వ్యాధులు వస్తాయన్నారు. పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలు తాగించాలని పాలు తాగించడం వల్ల ఆ శిశువుకు సంజీవనిలా పనిచేస్తాయని తెలిపారు. ప్రస్తుత కాలంలో తల్లి పాలు త్రాగించకుండా డబ్బా పాలు తాగించడం వల్ల శిష్యువులకు అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయన్నారు. మురిపాల విలువ తెలియక వాటిని తాగించడం లేదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే వ్యాధులు దరిచేరకుండా ఉంటాయ అన్నారు. మన గృహాలలో కూడా పరిశుభ్రత పాటించాలన్నార ప్రస్తుతం ఉన్న కాలంలో మనిషి బయటకు వెళ్లిన సమయంలో మాస్కు ధరించలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రేమలత, ఆర్ పి శ్రీదేవి ,అంగన్వాడీ కార్యకర్తలు రజిత, రేష్మ, కవిత ,ఆశా కార్యకర్తలు భాగ్యలక్ష్మి మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.