తూర్పుగోదావరి,(ఆరోగ్య
జ్యోతి ):ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు అన్ని చర్యలు
చేపట్టిందని డి ఎమ్ చ్ ఓ డాక్టర్ సిహెచ్. పు ష్కరరావు అన్నారు. రాజోలు
నియోజకవర్గం సోంపల్లి గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినే ట్రయిల్
రన్ కార్య క్రమం ప్రారంభించారు. తాటిపాక.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సోంపల్లి, పొదలాడ గ్రామాలకు
చెందిన సుమారు 200. మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడవలసిన అవసరం లేదన్నారు
ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని సూచించారు ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి
అపాయం లేదని భయభ్రాంతులకు గురి కావద్దని తెలిపారు ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి
వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలని ఆయన కోరారు.