నిజామాబాద్,(ఆరోగ్య జ్యోతి): నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో
పనిచేస్తున్న బాలామణి శనివారం నాడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాలమాని
వేలుపూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొత్తపల్లి సబ్ సెంటర్ లో యురోపియన్ ఏ
ఎన్ ఎం గా పనిచేస్తున్నారు. శనివారం ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా
వ్యాక్సిన్ కొత్తపల్లి సబ్ సెంటర్ కు
తీసుకు వెళుతుండగా పచ్చల నడుకుడ గ్రామ శివార్లలో ఈ ప్రమాదం సంభవించింది. తన కొడుకు
కు ను తీసుకొని కొత్తపల్లి వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో బాలమని అక్కడికక్కడే చనిపోయారు .తన కొడుకుకూ
తీవ్ర గాయాలు అయ్యాయి. జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా గ్రామానికి
వెళ్తున్నప్పుడు ఈ రోజు చనిపోవడం జరిగింది.ఆమె
కుమారుడికి కూడా తీవ్ర గాయాలు అయినవి. ఏ.ఎన్.ఎం. యూరోపియన్ స్కీం లో కాంటాక్ట్
పద్ధతిపై గత 15 సంవత్సరంలుగా
పని చేస్తున్నారు.