బాలమణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

 

నిజామాబాదు,(ఆరోగ్యజ్యోతి): జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వేల్పూర్, పరదిలోని ఉప కేంద్రం కొత్తపల్లి లో విధులు నిర్వహిస్తున్న ఏ. ఎన్. ఎం. బాలమణి ప్రమాదవశాత్తు విధినిర్వహణలో మరణిచారని .జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వెళ్తున్నప్పుడు ఈ రోజు  చనిపోవడం జరిగిందని .ఆమె కుమారుడికి కూడా తీవ్ర గాయాలు అయినవి. ఏ.ఎన్.ఎం. యూరోపియన్ స్కీం లో కాంటాక్ట్ పద్ధతిపై గత 15 సంవత్సరంలుగా పని చేస్తున్నారు. వీరికి వీరి కుటుంబానికి 50లక్షల ఎక్సగ్రేసియా చెల్లించాలని జిల్లా ఆరోగ్య విస్తరణాధికారుల సంఘం, జిల్లా అధ్యక్షులు యెనుగందుల శంకర్, ప్రధానకార్యదర్శి చింత సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు సిర్ప గోవర్ధన్, సలహాదారులు సురేష్ డిమాండ్ చేశారు. వారి కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని  క్షేత్రస్థాయి సిబ్బంది ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య విస్తరణాధికారులు, అధికంగా కరోనా బారినపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆసుపత్రిలో పరీక్ష చేసే ల్యాబ్ టెక్నీషియన్,సేవలందించే నర్స్ లు కాంటాక్ట్స్ పద్ధతిలో  సేవలందిస్తున్నారు. వీరికి దురదృష్టవశాత్తు మరణిస్తే వారికి కనీస ఎక్స్ గ్రేషియా అందడం లేదు. రాష్ట్రప్రభుత్వం కూడా కొంత ఎక్స్ గ్రేషియాను ప్రకటించవలసిందిగా జిల్లా ఆరోగ్య విస్తరణాధికారుల సంఘం, జిల్లా అధ్యక్షులు యెనుగందుల శంకర్, ప్రధానకార్యదర్శి చింత సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు సిర్ప గోవర్ధన్, సలహాదారులు సురేష్ డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం లో ప్రతి బుధవారం నిర్వహించే జాతీయ టీకాల కార్యక్రమం లో గర్భిణీ లు, శిశువులకు టీకాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రతి సోమవారం నిర్వహించే అమ్మ ఒడి కార్యక్రమం లో గర్భిణులకు పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడు అనుకోని పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి లేకపోతే వారిపై ఆధారపడ్డ కుటుంబ పరిస్థితి అగమ్యగోచరం. ప్రసవ సమయం లో గర్భిణీ లకు నార్మల్ కానీ శస్త్రచికిత్ష కానీ అవసరమైతే వారికి సేవలందించే నర్సు లు గాని,  మరణిస్తే వారికి కూడా ఎక్స్ గ్రే షియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.