ఉద్యోగాల నియమకానికి దరఖాస్తులు చేసుకోండి

 

ఆదిలాబాద్ ,(ఆరోగ్యజ్యోతి): జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా లోని ఆరోగ్య ఉప కేంద్రముల నుండి  హెల్త్ & వెల్నెస్ సెంటర్ లగా మార్చబడుతున్న (18) కేంద్రములలో   మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) గా నియమకానికి దరఖాస్తులు  చేసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖధికారి డాక్టర్ నరేందర్  ఒక ప్రకటనలో తెలిపినారు. ప్రభుత్వ జి.. 205(HM&FW Dept. ) తేది: 16/03/2021 ప్రకారం ఈ క్రింది వారు అర్హులు.మెడికల్ ఆఫీసర్ ఎం‌బి‌బి‌ఎస్ (కాంట్రాక్ట్ పద్దతిలో), మెడికల్ ఆఫీసర్ అయూష్  (కాంట్రాక్ట్ పద్దతిలో),బి.ఎస్‌సి. నర్సింగ్ (కమ్యూనిటి మెడిసిన్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో  దరఖాస్తు కొరకు వరంగల్ అర్బన్ జిల్లా అధికారిక వెబ్ సైట్ warangalurban.telangana.gov.in నుండి 04.04.2021 నుండి 19.04.2021 వరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తు, సర్టిఫికట్లు మరియు జిల్లా వైద్యాధికారి ఆదిలాబాద్.డి. జతపరచి 19.04.2021 సాయంత్రం ,5:00 గంటల లోపు జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి, ఆదిలాబాద్ లో సమర్పించలన్నారు.