టీకానే ఆయుధం

 

ప్రధాని నరేంద్ర  మోదీ

న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): కరోనాపై యుద్ధాన్ని గెలవడానికి, కోవిడ్‌ 19 నుంచి ప్రాణాలను రక్షించుకోవడానికి అత్యంత ముఖ్యమైన ఆయుధం టీకా అని ప్రధాని నరేంద్ర  మోదీ పేర్కొన్నారు. జీవితకాలంలో ఒకసారి ఎదురయ్యే అసాధారణ విపత్తు ఇదని, ఈ మహమ్మారితో ఎంతో మంది ఆత్మీయులను కోల్పోయామని, ఆర్థికంగా కూడా ఇది భారీగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుధవారం వేసక్‌ గ్లోబల్‌ సెలబ్రేషన్స్‌లో ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం ఇచ్చారు. అన్ని దేశాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందన్న ప్రధాని.. పరిస్థితులు గతంలో వలె ఉండబోవని, భవిష్యత్‌ పరిణామాలను ఇకపై కరోనా పూర్వ కరోనా అనంతరపరిణామాలుగా గుర్తించాల్సి ఉంటుందన్నారు. కరోనాపై పోరులో ముందంజ వేశామనికరోనాను తుదముట్టించే కీలక ఆయుధంగా టీకా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.