వరంగల్,(ఆరోగ్యజ్యోతి):వరంగల్ నగరాన్ని హబ్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సోమవారం ప్రకటించారు .రెండు వందల ఎకరాల లో హెల్త్ కాంప్లెక్స్ నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలిపారు .28 గంటల్లో పది అంతస్తుల భవనం నిర్మించిన చైనా దేశం లాగా పనులు వేగవంతంగా చేపట్టామని తెలిపారు. అవసరమైతే చైనా లో నిర్మించిన నిపుణులను రప్పించి అన్ని రకాల సలహాలు సూచనలు తీసుకుని వేగవంతంగా నిర్మిస్తామని సూచించారు .అత్యాధునిక వైద్య విధానాలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం నిర్మాణానికి పూర్తి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోమవారం వరంగల్ పట్టణంలో ఆయన అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు .అలాగే నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిపాలన భవనాన్ని కూడా జిల్లా కలెక్టర్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కాకతీయ వైద్య కళాశాల పాత సెంట్రల్ జైల్ ప్రాంతీయ నేత్ర వైద్య కళాశాల ఆటోనగర్ ఎంజీఎం ఆస్పత్రిలో కలుపుకొని 200 ఎకరాల వరకు అవుతుందని వీటన్నింటినీ కలిపి అద్భుతమైన ప్రణాళికతో నిర్మిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు .ఎంజీఎం ఆస్పత్రికి కూల్ చేసి అన్ని సౌకర్యాలతో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ డెంటల్ కళాశాల దీనికి అనుబంధంగా ఆసుపత్రిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రతి ప్రత్యేక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.