ముఖ్యమంత్రి ఆలోచననే మెడికల్ హబ్ ల ఏర్పాటు
· ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలు
· రిమ్స్ అభివృద్ధికి 20 కోట్లు
· రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్
జిల్లా కేంద్రం లోని రిమ్స్ వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు తెలంగాణ రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం ద్వారా రోగులకు ఉచితంగా వైద్య
పరీక్షలు చేయడం జరుగుతుందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
అన్నారు. బుదవారం నాడు
రిమ్స్ ఆవరణలోని తెలంగాణ రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని, వాహనాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ
సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ సమావేశంలోమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు
స్వయంగా ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో 19 చోట్ల తెలంగాణ రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు
చేయడం జరిగిందన్నారు. ఒకేరోజు 19 చోట్ల ప్రారంభించడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు.
ఒకేసారి 57 రకాల పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ల్యాబ్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు.
గిరిజన జిల్లాలో ఇలాంటి ల్యాబ్ ఎంతో అవసరమని ఆయన కొనియాడారు. వైద్య పరీక్షలు
నిర్వహించడం పరీక్షల్లో రోగనిర్ధారణ అయినట్లయితే పక్కనే ఉన్న రిమ్స్ లో చేరి
చికిత్స చేసుకొని సంపూర్ణ ఆరోగ్యం ఇంటికి
వెళ్ళవచ్చు అన్నారు. జిల్లాలో 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రక్త పరీక్షలు కోసం
సేకరించిన రక్తాన్ని నాలుగు వాహనాల ద్వారా ల్యాబ్ కు చేర్చి వెంటనే రిపోర్ట్
ఇవ్వడం అన్న విషయం ఎంతో సంతోషకరమన్నారు. ప్రారంభదశలో ఉందని,మిగితా అన్ని రకాల
పరీక్షలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు . ల్యాబ్ లో వైద్య
పరీక్షలు నిర్వహించడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళవలసిన అవసరం లేదని
తెలిపారు. రాబోయే రెండు సంవత్సరాల్లో తెలంగాణలోని అన్ని జిల్లాలో వైద్యం కోసం ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయలు
కేటాయించి ఉన్నదని మంత్రి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి జిల్లా కేంద్ర
ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వరకు అన్ని రకాల వైద్య సౌకర్యాలు వైద్య సేవలు
అందుబాటులోకి రానున్నాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. మూడు కోట్ల రూపాయలతో
ఏర్పాటుచేసిన ఈ తెలంగాణ డయాగ్నసిస్ సెంటర్లలో అన్నిరకాల సౌకర్యాలు అందుబాటులో
ఉన్నాయని ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ
సందర్భంగా ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న. జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, డైరీ చైర్మన్
లోక భూమారెడ్డి, డిసిసిబి చైర్మన్ నాందేవ్ కంబ్లె, ఏఎంసీ చైర్మన్ ప్రలాద్,
మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్, కౌన్సిలర్ వెంకన్న, ఆర్డీవో జాడే రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ శైలజ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
డాక్టర్ నరేందర్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బలిరాం నాయక్, డిప్యూటి డి ఎం
అండ్ హెచ్ వో డాక్టర్ సాదన , జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ వై సి శ్రీనివాస్. అడిషనల్ డి ఎం అండ్ హెచ్ వో జిల్లా లెప్రసీ మరియు ఎయిడ్స్
నివారణ అధికారి డాక్టర్ శ్రీకాంత్, డిఐఓ డాక్టర్ విజయసారది, జిల్లా NCD అధికారి డాక్టర్
క్రాంతి , డాక్టర్ నవ్యసుధ, తెలంగాణ
వైద్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.