దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేలో 730 మంది వైద్యుల మృతి

 

- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడి

న్యూ ఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): కరోన సెకండ్ డే లో దేశవ్యాప్తంగా 330 మంది వైద్యులు మరణించినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐయంఎ) తెలిపింది. ప్రజలకు సేవలందించడంలో ముందున్న వైద్యులు కరోనతో మరణించడం చాలా బాధాకరమైన విషయమని అని తెలిపింది. 115 మంది బీహార్ లో వైద్యులు మరణించగా ఢిల్లీలో 19 మంది కరోన బారినపడి మరణించినట్లు వెల్లడించింది. రాష్ట్రాలవారీగా చూసినట్లయితే కరోనతో మరణించినవైద్యుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో  38, మంది. అస్సాంలో 9, బీహర్ లో  115, ఛత్తీస్ ఘడ్ లో 5, ఢిల్లీ లో109, గుజరాత్ లో  37, గొవాలో 2, హర్యానాలో 3, జమ్మూకాశ్మీర్లో 3, జార్ఖండ్లో 39, కర్ణాటకలో 9, కేరళలో 24, మధ్యప్రదేశ్ లో 16, మహారాష్ట్రలో 23, మణిపూర్ లో 5, ఒరిస్సా లో 31, పాండిచ్చేరిలో 1, పంజాబ్లో 3, రాజస్థాన్లో 43,   తమిళనాడులో 32, తెలంగాణలో 37, త్రిపురలో 2, ఉత్తరప్రదేశ్లో 79, ఉత్తరాఖండ్లో 62, చొప్పున వైద్యులు కర్రలతో మరణించినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐయంఎ) తెలిపింది.