ఎం హెచ్ ఎం సిబ్బందికి పెరగని వేతనాలు

     కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

2018 నుంచి నష్టపోతున్న ఉద్యోగులు

ప్రత్యేక జీవో అమలు చేసి వేతనాలు పెంచండి

(ఆరోగ్యజ్యోతి- డెస్క్):నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ పి ఆర్ సి లో వేతనాలు పెరగలేదు. వైద్య ఆరోగ్య శాఖలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెరగకపోవడంతో నిరాశకు గురి అయ్యారు . నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) చాలా వరకు కేటగిరీల్లో మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్టులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఏ ఎన్ ఎం లు, సెకండ్ ఏఎన్ఎంలు, అడ్మినిస్ట్రేషన్ స్టాప్, ల్యాబ్ టెక్నీషియన్లు, డి ఈ ఓ లు, ఫార్మసిస్ట్ లు, ఫైనాన్స్, ఎం ఎన్ ఎల్ హెచ్ పి... ఈ ఈ హెచ్ ఓ లు, ఎన్ పి ఎం ల తోపాటు ఇతర ఉద్యోగులు పనిచేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం లో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం)  పనిచేస్తున్న ఉద్యోగులు అందరికీ వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరుకుంటున్నారు.కోవిడ్  సమయంలో వారి ప్రాణాలకు తెగించి కోవిడ్ తో పోరాటంచేస్తున్న రోగులకు వైద్య సేవలు అందించిన ,ఈ సిబ్బందికి వేతనాలు పెంచకపోవడం అన్నది బాధాకరమైన విషయం. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు 2016లో పెంచాల్సిన వేతనాలను 2018లో 500 జీవో జీవో ప్రకారం నామమాత్రంగా పెంచారు రాష్ట్రంలో దాదాపు 12 వేల మందికి పైగా వివిధ కేటగిరీల్లో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) లో విధులు నిర్వహిస్తున్నారు. 510 జీవో ప్రకారం కొంతమంది. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు వేతనం పెంచినారు. ఇదే  510 జీవో ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు వేతనం మూడు నుంచి నాలుగు వేల మందికి ఉద్దోగులకు ఇంక  2018 లో పెంచవలసిన  వేతనాలు ఇంక పెంచలేదు. 510 జీవో ప్రకారం 2018 లో పెంచవలసిన వేతనాలు నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు మూడు సంవత్సరాలు గడుస్తున్నా కొంతమందికి ఇంకా పెంచలేదు. చాలాసార్లు ఉన్నత అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ఉద్యోగసంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతారని  నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) సిబ్బంది కూడా ఆనందంతో గంతులేశారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం)  సిబ్బంది ప్రాణాలకు తెగించి కరోన సమయంలో సేవలందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచుతుందని ఎదురు చూశారు. కానీ పి ఆర్ సి లో మాత్రం వారికి నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక జీవో విడుదల చేస్తూ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) లో పనిచేస్తున్న ఉద్యోగులు అందరికీ వేతనాలు పెంచాలని సిబ్బంది  తెలంగాణా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

నేషనల్ హెల్త్ మిషన్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14642 మంది వివిధ పోస్టుల్లో పని చేస్తున్నారు.1406 మెడికల్ ఆఫీసర్లు, 274 స్పెషలిస్టులు, 2902 స్టాఫ్ నర్సులు, 599 పారామెడికల్ సిబ్బంది, 1124 ఏ ఎన్ ఎం లు, 4199 మంది సెకండ్ ఏఎన్ఎంలు, 346 మంది అడ్మినిస్ట్రేషన్ స్టాప్, 513 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 517 మంది డి ఈ ఓ లు, 711 ఫార్మసిస్ట్ లు, 99 మంది ఫైనాన్స్,98 మంది ఎం ఎన్ ఎల్ హెచ్ పి... ఈ ఈ హెచ్ ఓ లు, 101 ఎన్ పి ఎం ల తోపాటు 1753 మంది ఇతర సిబ్బంది ఎన్నారం లో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది.




ప్రత్యేక జీవో తీసుకువచ్చి ఉద్యోగులకు వేతనాలు పెంచాలి

 

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ప్రత్యేక జీవో తీసుకువచ్చి వేతనాలు పెంచాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు.కరోన  కష్టకాలంలో పెన్షన్ ఉద్యోగులు ప్రాణాలకు తెగించి రోగులకు సేవలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం వారి సేవలను గుర్తించుకొని ప్రత్యేక జీవో తీసుకువచ్చి ఉద్యోగులకు వేతనాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.  వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోరాడుతామని తెలిపినారు.

తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్

రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ (హైదరాబాద్)..

అందరితో సమానంగా వేతనాలు పెంచాలి

     నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) అందరితో సమానంగా పనిచేస్తున్నారని వారందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలని తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ బొంకంటి సుభాష్  డిమాండ్ చేశారు. కరోన  కష్ట కాలంలో పనిచేసిన వైద్య సిబ్బందికి దృష్టిలో ఉంచుకొని వేతనాలు పెంచాలని డిమాండ్ చేసినారు.

తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్

 అసోసియేట్ ప్రెసిడెంట్ బొంకంటి  సుభాష్ ( ఆదిలాబాద్)...