కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
వరంగల్ ,(ఆరోగ్యజ్యోతి): నేషనల్ హెల్త్
మిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 11వ
పిఆర్సి వర్తింప చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ పైగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు
పిఆర్సి వర్తింపచేయాలని వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక వరంగల్ ఉమ్మడి జిల్లా
సమావేశాన్ని హనుమకొండలోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ లో ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక నాయకులు వివిధ సంఘాల ఐక్యవేదిక నాయకులు
వి రాజయ్య, భత్తని సుదర్శన్ గౌడ్, రామ రాజేష్ కన్నా, నెహ్రూ చంద్ ,నాగ శశికాంత్, రాజకుమార్,
మంచిగ ప్రమోద్ కుమార్ గౌడ్, చుక్క రవికుమార్ , కే మల్లయ్య ,సుమన్ ,వెంకటేశ్వర వర్మ,
స్వరూపా, హేమలత, మమత, వీరేందర్ నాయక్ ఏకుల చిరంజీవి , సందీప్ కుమార్ మాట్లాడుతూ
నేషనల్ హెల్త్ మిషన్ స్కీం లో మెడికల్ ఆఫీసర్లు,
స్పెషలిస్టులు,
స్టాఫ్ నర్సులు,
పారామెడికల్ సిబ్బంది, ఏ ఎన్ ఎం లు,
సెకండ్ ఏఎన్ఎంలు, అడ్మినిస్ట్రేషన్ స్టాప్,
ల్యాబ్ టెక్నీషియన్లు, డి ఈ ఓ లు,
ఫార్మసిస్ట్ లు,
ఫైనాన్స్, ఎం
ఎన్ ఎల్ హెచ్ పి... ఈ ఈ
హెచ్ ఓ లు, ఎన్
పి ఎం ల తోపాటు ఇతర సిబ్బంది వివిధ ఉద్యోగాల్లో పని చేస్తున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల మందికి పైగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ నేషనల్ హెల్త్
మిషన్ లో పని చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలకు
తెగించి కరోనా పాజిటివ్ కేసు లకు ఎంతగానో సేవలందించిన సిబ్బందిని కి తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమైన విషయం అన్నారు ఏ శాఖ వారు పని చేయక
పోయినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ అనుబంధ శాఖల అని రెండు సంవత్సరాలుగా కంటికి నిద్ర
లేకుండా పని చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర 2018లో 510 జీవో
జీవో ప్రకారం నామమాత్రంగా పెంచారన్నారు. రాష్ట్రంలో దాదాపు 14 వేల మందికి పైగా వివిధ కేటగిరీల్లో
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) లో విధులు నిర్వహిస్తున్నారని వారు తెలిపినారు. 510 జీవో
ప్రకారం కొంతమందికి
వేతనాలు పెంచినారు. ఇదే 510 జీవో ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్
(ఎన్ ఎహ్ ఎం) 9 వెల మంది ఉద్యోగులకు వేతనంపెంచారని, మూడు నుంచి నాలుగు వేల
మందికి ఉద్దోగులకు ఇంక వేతనం
పెంచలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి
ప్రత్యేక జీవో ద్వారా నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి వేతనాలు
పెంచాలని వారు డిమాండ్ చేశారు.