కాంట్రాక్టు వైద్యులను రెగ్యులర్ వైద్యులుగా గుర్తించండి

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ , మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

ఒప్పంద  వైద్యుల సంఘం ఆధ్వర్యంలో డిఎంఎహ్ఓ  కి వినతి పత్రం

 ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యులను రెగ్యులర్ వైద్యులుగా నియమించాలని తెలంగాణ ఒప్పంద వైద్యుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. వీరికి టి డి పి హెచ్ డి ఎ రెగ్యులర్ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి ,ప్రధాన కార్యదర్శి క్రాంతి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఒప్పంద వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సందీప్ మాట్లాడుతూ ఒప్పంద వైద్యులకు ఉద్యోగ భద్రత లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఒప్పంద వైద్యులుగా పనిచేస్తున్న వారందర్నీ రెగ్యులరైజేషన్ చేయాలని వారు డిమాండ్ చేశారు.కరోన సమయంలో అందరూ వైద్యులతో సమానంగా పని చేసినప్పటికీ ప్రభుత్వం ఒప్పంద వైద్యులను గుర్తించలేదని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి కరోన సమయంలో కరోనా రోగులకు వైద్యసేవలు అందించినప్పటికీ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రెగ్యులర్ వైద్యులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒప్పంద వైద్యులు డాక్టర్ వినోద్ డాక్టర్ నవీన్ ఏం డాక్టర్ హిమబిందు డాక్టర్ సురేష్ డాక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.