కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
తలమడుగు,ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):వర్షాకాలం
ప్రారంభమైందని వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సాధన అన్నారు. శుక్రవారం నాడు తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రన్ని ఆమె ఆకస్మికంగా
తనిఖీ చేశారు. ఆస్పత్రిని పరిశీలించారు. వర్షాకాలం కావడంవల్ల గ్రామాల్లో అవగాహన
సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. గ్రామాల్లో చెత్తాచెదారం
లేకుండా శుభ్రపరచాలని సంబంధిత గ్రామ
సర్పంచ్ కార్యదర్శులకు సూచించాలని చెప్పారు. క్లోరినేషన్ ఎప్పటికప్పుడు చేయించాలని
తెలిపారు. అనంతరం ఆశ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రతి
సర్వేను పూర్తి చేయాలని ఆశలకు ఆమె సూచించారు. వర్షాకాలం కావడం వల్ల జాగ్రత్త లో గా
ఉండాలని ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత ఆశా కార్యకర్తల పై ఉందని ఈ సందర్భంగా ఆమె
తెలిపారు.మాతాశిశు సంరక్షణ కోసం కృషి చేయాలన్నారు. గర్భవతులకు క్రమం తప్పకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో
అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించాలని, ప్రసూతి ఆస్పత్రుల్లో అయ్యే విధంగా
చూడాలన్నారు. ఆస్పత్రిలో ప్రసూతి ఐతే తల్లి
బిడ్డ క్షేమం గా ఉండటంతో పాటు కెసిఆర్ కిట్టు తో పాటు నగదు కూడా ప్రభుత్వం
ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్
రాహుల్ తదితరులు పాల్గొన్నారు.