సమయానికి రాని గిమ్మ ఆరోగ్య సిబ్బంది

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

·         9 గంటలకు ఒకే స్టాఫ్ నర్స్ వీధుల్లో

·         అందుబాటులో లేని వైద్య అధికారి

·         స్టాఫ్ నర్స్, పార్మసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్

 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తెరిచి ఉంచాలనినిబంధన ఉన్నప్పటికీ సిబ్బంది మాత్రం ఇష్టం వచ్చిన రీతిలో సమయపాలన లేకుండా సిబ్బంది విధులు హాజరావ్తున్నారు. జైనథ్ మండలంలోని గిమ్మ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆరోగ్య జ్యోతి ఉదయం 9 నుండి 10 గంటలవరకు పరిశీలించగా ఉదయం 9 గంటలకు ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే వచ్చారు. మిగతా సిబ్బంది ఎవరు కూడా విధులకు పది గంటల వరకు హాజరుకాలేదు. ఉదయం నుంచి వైద్య సేవల కోసం రోగులు వచ్చి పోతూ ఉంటారు .కానీ అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ ,ల్యాబ్ టెక్నీషియన్, వైద్యాధికారి అందుబాటులో లేరు. సరే ఒక పది పదిహేను నిమిషాలు ఆలస్యంగా వచ్చిందంటే అది కూడా లేదు. 10 గంటల వరకు కూడా ఎవరూ రాలేదు. ఆ తర్వాత ఎన్ని గంటలకు వచ్చారు అనే విషయం తెలవదు. ఉదయం 9 గంటల నుండి ఒంటిగంట వరకు ఓ పిల్లో ప్రతి ఒక్కరు విధులు నిర్వహించాలి.అలాగే 2 నుంచి 4 వరకు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంన్ని తెరిచి ఉంచాలి. కానీ ఇందుకు విరుద్ధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనిపించింది పది గంటలు అయినా సిబ్బంది రాలేదంటే మనం ఆలోచించదగ్గ విషయమే. ఏ సిబ్బంది విధులకు హాజరయ్యే టైంలో పది నిమిషాలు 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చే దాంట్లో అతిశయోక్తి ఏమీలేదు .కానీ గంటల తరబడి విధులకు హాజరు కావడం లేదంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయమే.. ఉదయం 9 గంటలకు వైద్యాధికారి స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ ఇతర సిబ్బంది వీధుల్లో కచ్చితంగా ఉండాలి .కానీ ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు స్టాఫ్ నర్స్ లో కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ మాత్రమే 9 గంటలకు విధులకు హాజరయ్యారు. మిగతా సిబ్బంది 10 గంటల వరకు కూడా హాజరు కాలేదు.

తొమ్మిది గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుతెరిచి పనిచేస్తున్న సిబ్బంది అందరు విధుల్లో ఉండాలి. కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రం తొమ్మిదిన్నరకు విధులకు హాజరవుతారని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నిర్మల ఆరోగ్య జ్యోతి తో చెప్పారు. ఈరోజు విధులకు అందరు హాజరవుతున్నారని కానీ ఈరోజు కొద్దిగా అరగంట ఆలస్యమైందని చెప్పారు. కానీ డాక్టర్ చెప్పిన మాటలకు పొంతన లేని విధంగా ఉన్నాయి 9:30 కు వచ్చే సిబ్బంది 10 దాటిన ఎవరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రనికి విదులకు హాజరు  కాలేదు. వైద్యాధికారి మాత్రం ఇమ్యునైజేషన్ విజిట్ కి వెళ్లినట్లు వైద్య అధికారి డాక్టర్ నిర్మల ఆరోగ్య జ్యోతి తో చెప్పారు. కానీ ఇమ్యునైజేషన్ కు అప్పుడే అందరూ వ్యాక్సిన్ తీసుకువెళ్లారు. ఒకవేళ ఇమ్యునైజేషన్ విధులకు వెళ్ళాలంటే ఉదయం 9 నుంచి 1 వరకు ఓపి చూసి మధ్యాహ్నం రెండు గంటల నుంచి 4 గంటల వరకు ఫీల్డ్ కి వెళ్ళాలి.