తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతే రైతులకు అనేక సంక్షేమ పథకాలు

 

- డీసీఎంఎస్ వైస్. చైర్మన్  కొత్వాల

భద్రాది కొత్తగూడెం,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  నాయకత్వంలో రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరిగాయనీ,  అన్ని విధాలుగా రైతులకు న్యాయం జరిగిందని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ పాల్వంచ  సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 8 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం ఎదుట కొత్వాలపతాకాన్ని ఎగురవేశారు. కార్యాలయంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్బంగా కొత్వాల మాట్లాడుతూ కె.సి.ఆర్ ప్రభుత్వ హయాంలోనే ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టారనీ, రైతు రుణమాఫీ, రైతులకు 5 లక్షల ఇన్సూరెన్స్, రైతులకు 24గంటల విద్యుత్, రైతుబంధు పథకం పేరుతో ఎకరానికి 10 వేల రూ"ల పంట పెట్టుబడి, ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు, రైతు కళ్లాలు వంటి పథకాలతో రైతులకు చేరువయ్యారన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, వ్యవసాయశాఖాధికారి శంభో శంకర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ జి.ప్రియాంక, సొసైటీ డైరెక్టర్లు కనగాల నారాయణ, చౌగాని పాపారావు, జరబన సీతా రాంబాబు, భూక్యా కిషన్, మేకా త్యాగరాజు,సొసైటీ సిబ్బంది సురేందర్ రెడ్డి, లక్షి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.