కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
గుడిహత్నూర్, ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న
నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 11వ పిఆర్సి లో
వేతనాలు పెంచలేదని వెంటనే పెంచేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆదివారం
నాడు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు వినతి
పత్రం సమర్పించారు. గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యునైటెడ్ మెడికల్
హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సంఘం ప్రతినితులు
ఆనంద బాయ్,సునీత,శారద, మిగతా సిబ్బంది
కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ
సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ హెల్త్
మిషన్ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి కరోనా పాజిటివ్ కేసు లకు ఎంతగానో
సేవలందించిన సిబ్బందిని కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమైన
విషయం అన్నారు ఏ శాఖ వారు పని చేయక పోయినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ అనుబంధ శాఖల ఉద్యోగులు
గ రెండు సంవత్సరాలుగా కంటికి నిద్ర లేకుండా పని చేస్తున్నారని తెలిపినారు. ఉద్యోగులకు
11వ పిఆర్సి వర్తింపజేయక
పోవడం చాలా బాధకరం కావున వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకోని అన్ని ప్రోగ్రామ్ లో, పనిచేస్తున్న వారికి పిఆర్సి వర్తిమజేయాలని వారు ప్రభుత్వాని కోరినారు.