కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): అంకోలి
ప్రాథమిక
ఆరోగ్య కేంద్రం పరిధిలోని దస్నాపూర్ ఉప ఆరోగ్య కేంద్రం లో గర్భిణీలకు వైద్య
పరీక్షలు నిర్వహించారు. ప్రతి సోమవారం గురువారం రోజు గర్భిణీలకు వైద్య పరీక్షలు
నిర్వహించడం జరుగుతుందని సూపర్వైజర్ సురేష్ తేలిపినారు. ఈ సందర్భంగా సూపర్వైజర్
మాట్లాడుతూ గర్భిణీలకు హిమోగ్లోబిన్ తో పాటు షుగర్, బిపి ,యూరిన్ ,ఎత్తు, బరువు
పరిక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు .గర్భవతులు
తీసుకోవలసిన జాగ్రత్తల జాగ్రత్తల గురించి గర్భిణీ స్త్రీలకు ప్రతి వారం అవగాహన
కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గర్భవతులు తీసుకోవలసిన ఆహారం
వాటిలో లభించే విటమిన్స్, మినరల్స్, క్యాల్షియం, ఐరన్ తదితర వాటి గురించి అవగాహన
కల్పించడం జరుగుతుందని తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ముంతాజ్, పి శకుంతల, ఆశ
కార్యకర్త నర్మద లు పాల్గొన్నారు.