వరంగల్ అర్బన్(ఆరోగ్యజ్యోతి) : కోవిడ్- 19 పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరామ్
చేయాలనీ ఐక్యవేదిక - కమిటీ రామ రాజేష్ ఖన్నా ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరినారు . తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో వైద్యులు
పారామెడికల్ సిబ్బంది వివిధ కేంద్ర &
రాష్ట్ర పథకాల ఉద్యోగులు ఆశా కార్యకర్తల వరకు సుమారు లక్షకు
పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. కరోనా మహమ్మారి నియంత్రణకై 2020 మార్చి నుండి
నేటి వరకు 16 నెలలుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. సుమారు 50 మందికి పైగా ప్రాణాలు
కోల్పోయారు. వేలాది మంది సిబ్బంది కరోనాకు గురై కుటుంబాలతో సహా తీవ్ర ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో వైద్య ఆరోగ్య శాఖ అన్నిస్థాయిల ఉద్యోగుల సమస్యల
పరిష్కారం కోసం ఐక్యంగా అన్ని సంఘాలు కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి
పరిష్కరించుకోవడం కోసం 'వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక (ఎం & హాఫ్) ఏర్పడింది.ఈ
వేదిక ఆధ్వర్యంలో తక్షణమే ఈ క్రింది సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి
చేస్తున్నాం.
ఐక్యవేదిక డిమాండ్స్ .....
Ø వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అన్ని స్థాయిల్లోని
అన్నిరకాల క్యాడర్స్ ఉద్యోగుల కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా వెంటనే
వ్యాక్సినేషన్ చేయాలని కోరుతున్నాం..
Ø కోవిడ్- 19 కి గురైన వైద్య ఆరోగ్య ఉద్యోగులందరికీ ప్రభుత్వ
ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆక్సిజన్తో కూడిన 10% బెడ్స్ ప్రత్యేకంగా కేటాయించే విధంగా
చర్యలు తీసుకోవాలి.
Ø కోవిడ్- 19 కి గురైన వైద్య ఆరోగ్య సిబ్బంది కుటుంబ సభ్యులకు
జిల్లా కేంద్రాలు పట్టణ కేంద్రాల్లో ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి.
Ø కరోనా బారిన పడి మృతి చెందిన వారికి కేంద్రం ఇచ్చే రూ
50లక్షల ఇన్సూరెన్స్తో పాటు రాష్ట్ర కేంద్రం కూడా రూ 50 లక్షలు ఎక్స్ప్రెషియా
ఇవ్వాలి. వారి కుటుంబ సభ్యులలో అర్హతను బట్టి చనిపోయిన ఉగ్యోగి స్థాయికి తగ్గకుండా
ఉద్యోగం ఇవ్వాలి.
Ø కరోనా ఇన్సెంటీవ్ 2020 ఏప్రిల్ మే నెలలు మాత్రమే 10%
ఇచ్చారు. ఆ తరువాత కాలంలో ఇవ్వలేదు. దానిని కొనసాగించి వైద్య ఆరోగ్య
ఉద్యోగులందరికీ ఇవ్వాలి.
Ø ఉద్యోగులపై పనిభారం తగ్గించడానికి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. ఉదా: టిఎస్పిఎస్సి ద్వారా 2017 నోటిఫికేషన్లో సెలక్ట్ అయినవారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి.