జిల్లాలో పని చేస్తున్న వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  984802545)

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లాలో పనిచేస్తున్నపార  మెడికల్ సిబ్బంది కేంద్ర రాష్ట్రాల పథకాల లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను  ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పట్నాయక్ కి  వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తన చాంబర్లో సోమవారంనాడు  వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక డాక్టర్ శ్రీధర్ మెట్పల్లివార్, కన్వీనర్ బండారి కృష్ణ లు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న అన్ని స్థాయిల్లో అన్ని రకాల క్యాడర్ ఉద్యోగుల కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా వెంటనే వ్యాక్సిన్ చేయాలని కోరారు .అలాగే కొవిడ్-19 గురైన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో ఆక్సిజన్ తో కూడిన 10% ప్రత్యేక కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కరోన బారినపడి మృతి చెందిన వారి కి కేంద్రం ఇచ్చే 50 లక్షల ఇన్సూరెన్స్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కరోనా ఇన్స్టంట్ 2020 ఏప్రిల్ మే నెల మాత్రమే 10 శాతం ఇచ్చారని తర్వాత కాలంలో ఇవ్వలేదని దానిని కొనసాగించి పెండింగ్లో ఉన్న ఇన్స్టంట్ వెంటనే ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల పని భారాన్ని తగ్గించి వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నవ్య ,వెంకటరమణ, ధనుంజయ్ ,నవీన్, తదితరులు పాల్గొన్నారు.