బాలాజీ నగర్ లో పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమం

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): అంకోలి  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దస్నాపూర్ ఉప ఆరోగ్య కేంద్రం పరిధిలోని బాలాజీ నగర్ లో శనివారం నాడు సూపర్వైజర్ సురేష్, ఆరోగ్య కార్యకర్త శకుంతల  ఆధ్వర్యంలో పారిశుధ్యం పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం కావడం వల్ల పారిశుద్ధ్య లోపం వల్ల అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం తో పాటు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ప్రజలకు వివరించారు. మన ఇంటి చుట్టుపక్కల మురికి కాల్వలను శుభ్రం చేసుకోవాలని చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని తెలిపారు. నీటి నిలువలు ఉండడం వల్ల దోమలు చేరి అవి మన మీద వాలడం వాల్ల మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు సంభవించ డంతో పాటు అతిసార వ్యాధి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.