నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

జిల్లా వైద్య వైద్యాధికారి కి వినతి పత్రం

మంచిర్యాల,(ఆరోగ్యజ్యోతి):  నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నేషనల్ హెల్త్ మిషన్ కో చైర్మన్ రామ రాజేష్ కన్నా మంచిర్యాల జిల్లా దేవనపోయిన బాపు అన్నారు. మంగళవారం నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వారు వైద్య ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోన  సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడిన ఘనత వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇదేనని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల ఉద్యోగులకు పిఆర్సి పెంచారని సేవలందించిన మంది నేషనల్ హెల్త్ మిషన్ వైద్య ఉద్యోగులకు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు .2018 సంవత్సరంలో 510 జీవో ప్రకారం దాదాపు తొమ్మిది వేల మంది నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచాలని మిగిలిన నాలుగు వేలమంది ఉద్యోగులకు మాత్రం ఇంత వరకు వేతనాలు లేదని గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అకౌంటెంట్స్, డేటా ఆపరేటర్, కమ్యూనిటీ ఆర్గనైజర్ వర్కర్లకు నేషనల్ హెల్త్ మిషన్ వైద్య ఉద్యోగులకు వేతనాలు పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరారు .ఈ కార్యక్రమంలో సమ్మయ్య సెక్రటరీ దుపమ్ నవీన్ , జాడి కండోజు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.