సి ఎం కేసీఆర్ రాష్ట్రానికి కారణజన్ముడు

 

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

భద్రాది కొత్తగూడెం,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రగతి మైదాన్లో అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి, కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం   కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపినారు., వారి నాయకత్వంలో ఎమ్మెల్యే గా పని చేయడం ఆనందంగా ఉందని, దేశంలో వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం రెండవ రాష్ట్రం గా ఉన్నదని, కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ను అగ్రగామిగా నిలి పారని, తెలంగాణ ఉద్యమంలో నా కుటుంబం చురుకుగా పాల్గొనది అని, నా కుమారుడు వనమా రాఘవ తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి జైలుకు వెళ్లారని, ఈరోజు తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు  వనమా రాఘవేంద్ర రావు  జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఎంపీపీలు బాదావత్ శాంతి, భూక్యా సోనా, భూక్యా విజయలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు, కో ఆప్షన్ సభ్యులు, వార్డు మెంబర్లు, డైరెక్టర్లు, పార్టీ మండల అధ్యక్షులు, కాసుల వెంకట్, టిఆర్ఎస్ పార్టీ  నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.పాల్గొన్నారు.