ఆసుపత్రిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచాలి

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): కరోన మహమ్మారి వల్ల ఆక్సిజన్ అందక ఎందరో మంది మృత్యువాత పడ్డారని ఆసుపత్రిలో భవనాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి , ఆర్ బి ఎస్ కె సమన్వయకర్త డాక్టర్ విజయసారతి అన్నారు. శనివారం నాడు రిమ్స్ భవనం లోపల గల  ఆర్ బి ఎస్ కె లో సిబ్బందికి  మొక్కల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవనాల్లోనే మొక్కలు పెంచి ఆక్సిజన్ అందించే విధంగా కలెక్టర్ ఆదేశాల మేరకు హరిత హారంలో బాగంగా సిబ్బందికి మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆర్ బి ఎస్ కే లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి మొక్కను ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఆ మొక్క భవనంలోనే పెంచాలని దీని వల్ల ఆక్సిజన్ సరఫరా అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మొక్కలను కాపాడే బాధ్యత వారిదేనని ఆ మొక్కకు వారి పేరు పెట్టే విధంగా ఏర్పాట్లు చేశామని అయన తెలిపినారు.ప్రతి రోజు నీళ్లు పోయాలి అని తెలిపారు. ఈ మొక్కలు ఆస్పత్రిలో పెంచినట్లయితే ఆక్సిజన్ అందరికి అందుతుందని తెలిపారు. ఆర్ బి ఎస్ కె చేతన్ DEIC  మేనేజర్ ఆడే జైవింద్ నాయక్ ,డాక్టర్  రాధిక, స్రవంతి, కృష్ణ కిషోర్, దొంతుల ప్రవీణ్,రాంచందర్, ఉమాకాంత్, నవ్య తదితరులు పాల్గొన్నారు.