హేమలత మరణం తీరని లోటు

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  984802545

సిద్దిపేట,(ఆరోగ్యజ్యోతి): సిద్దిపేట వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డి ఈ ఓ గా పనిచేస్తున్న హేమలత మృతిచెందిన మృతుని జీర్ణించుకోలేకపోతున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్ అన్నారు. హేమలత పనిలో చురుకుదనం గా సహనంగా చేసేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు వైద్య ఆరోగ్య శాఖకు ఆమె మరణం తీరని లోటని డాక్టర్ పవన్ తెలిపారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చక్రధర్ తన తోటి ఉద్యోగి మరణించడం బాధాకరమైన విషయమని తెలిపారు ప్రభుత్వం నుండి సంబంధించిన యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు యూనియన్ తరపున, ఉద్యోగుల తరఫున సహాయ సహకారాలు వారి కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయని తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ సిబ్బంది తరఫున పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి అందజేశారు ఈ కార్యక్రమంలోప్రోగ్రామ్ అధికారి డాక్టర్ రాధిక, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేందర్, భూమపల్లి రాజు, సత్యనారాయణ రెడ్డి,కొండయ్య, దేవేందర్, కైలాష్, ప్రవీణ్ ,  104  ఉద్యోగులు , ఆర్.బీ.యెస్.కె ఉద్యోగులు పాల్గొని 2నిమిషాల మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు.