కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రి ఆవరణలో గల పీపీ యూనిట్లో వ్యాక్సిన్
కొనసాగుతుంది. సోమవారం రోజు కూడా అర్హులైన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ సిబ్బంది ఇచ్చారు. ఒకవైపు
రిజిస్ట్రేషన్ చేస్తూనే మరొకవైపు కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ప్రారంభం నుంచి ఇప్పటి
వరకు ప్రతిరోజు వ్యాక్సిన్ ఇస్తున్నారు.కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులైన వారందరూ
రిమ్స్ పీపీ యూనిట్ వచ్చి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని వెళ్తున్నారు. ప్రారంభంలో
పీపీ యూనిట్ ఒకటే చోట వ్యాక్సిన్ ఇచ్చేవారు. ఆ సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారు.
ప్రభుత్వం మళ్ళీ 18 సంవత్సరాలకు ఇచ్చినట్లయితే రద్దీ ఇక్కడ నెలకొనే అవకాశాలు ఉన్నాయి.