వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరికీ పీఆర్సీ ప్రకటించాలి

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి)విధి నిర్వహణలో కఠినంగా విధులు నిర్వహిస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ఉద్యోగులకు   ప్రభుత్వం ఎలాంటి గుర్తింపు ఇవ్వలేకపోవడం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అవమాన పరచినట్లేనని నేషనల్ హెల్త్ మిషన్ ఫెడరేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ అన్నారు. బుధవారం నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం ముందు శాంతియుత నిరసన కార్యక్రమాన్నినిర్వహించి  నిరసన తెలిపారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 24 గంటల పాటు విధులు  నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పిఆర్సి లో కానీ ప్రభుత్వ పథకాలు కానీ మొదటి ప్రాధాన్యత ఇవ్వవలసింది పోయి పిఆర్సి ప్రకటించకపోవడం బాధాకరమైన విషయం అన్నారు. కోవిడ్ సమయంలో కొన్ని శాఖలు మాత్రమే పని చేశాయని అందులో 24 గంటల పాటు శ్రమిస్తూ ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడిన వైద్య ఆరోగ్య శాఖ ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ప్రపంచ చరిత్రలోనే అతి భయంకరమైన వ్యాధి వాళ్ళ లాక్ డౌన్ పెట్టినారని , కానీ కోవిడ్ వచ్చిన వారికి దగ్గరుండి చికిత్స అందించిన ఘనత ఆరోగ్యశాఖ వారిదేనని తెలియజేశారు.అలంటి వారికీ పీఆర్సీ ప్రకటించకపోవడం భాదాకరం అన్నారు.ప్రభుత్వం వెంటనే   ప్రాణాలకు తెగించి పనిచేసిన నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు వైద్యులు పారామెడికల్ మెడికల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో తేజస్విని, అన్నపూర్ణ, జైవింద్, శ్రీనివాస్ రెడ్డి ,సుజాత,విజయలక్ష్మి, నీలా, శృతి, నేషనల్ హెల్త్ మిషన్ ఏఓ గితేష్, మలేరియా అనిల్, జక్కినవీన్, సంగీత,శోభా సుదారాని, ఎస్ ఎన్ సి యు రాజకుమార్, మల్లన్న, సుఫానా, రుచిత, రాంచందర్,కిషోర్,DCM అనిల్,ఉమాకాంత్, గోపాల్,ఇమ్రాన్,లెనిన్ ఉద్యోగులు పాల్గొన్నారు.