స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదిక ఏర్పాటు

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

29న మంత్రులను  కలవనున్న ఐక్య వేదిక సభ్యులు

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు అని ఏకతాటిపై వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ ని ఏర్పాటు చేశాయి. తెలంగాణలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు అన్ని ఏకం కావాలని ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు మీనగ గోపి బోయ, చైర్మన్ ఉప్పు సత్యనారాయణ,మహిళా ప్రెసిడెంట్  పన్యాల మమత గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ దామ రజిని రుద్రమ,వైస్ ప్రెసిడెంట్ గాయత్రి డాక్టర్. ఆలూరి విల్సన్,స్పోక్ పర్సన్ మంజుల, మహమ్మద్ ఆరిఫ్ ఉద్దీన్, కార్యదర్శి D.విజయ కుమారిలు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏకతాటిపై రావడానికి తాము ఎంతో కృషి చేస్తున్నామని ప్రతి స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ సహాయ సహకారాలు అందించాలని వారు కోరినారు. ఐక్యంగా ఉన్నట్లయితే అన్ని సాధించవచ్చని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈనెల 29న జేఏసీ ఆధ్వర్యంలో మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్,  ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లను  కలిసి సమస్యలు డిమాండ్స్ వివరించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

డిమాండ్స్

  • ·         స్వచ్ఛంద సంస్థ లకు (NGO) రాష్ట్ర ప్రభుత్వం తరపున గుర్తింపు కార్డు వాలు ఇవ్వగలరు.
  • ·         కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను ప్రాణంగా పెడుతూ సేవ చేస్తున్న స్వచ్ఛంద సంస్థ లకు (NGO) లకు ఉచిత బీమా సౌకర్యం (25లక్షలు) కల్పించాలి.
  • ·         ఎన్నో వ్యయ ప్రయసలకు ఓర్చి రాష్ట్ర వ్యాప్తంగా సేవలందింస్తున్న స్వచ్ఛంద సంస్థ లకు (NGO) ఉచిత బస్సు, రైలు సౌకర్యం కల్పించాలి.
  • ·         ఎలాటి షరతులు లేకుండా (10లక్షల) వరుకు ఋణ సదుపాయం కల్పించాలి.
  • ·         తెలంగాణ రాష్ట్ర ఆభిర్భావంలో కీలక పాత్ర పోషించి 7 సం"పూర్తి చేసుకున్నN.G.O సంస్థలకు ఎకరం స్థలం ఇచ్చి పోత్సహించాలి.
  • ·         తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా అమలు పరిచిన "డబుల్ బెడ్ రూం" పధకం N.G.Oలకు వర్తిపజేయాలి.
  • ·         స్వచ్ఛంద సంస్థ లకు (NGO) గౌరవ వేతనం కనీసం 10,000/-ప్రకటించాలి.
  • ·         బంగారు తెలంగాణ"సాకారం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం స్వచ్ఛంద సంస్థ లకు (NGO) భాగ్యసామ్యం చెయ్యాలి.
  • ·         స్వచ్ఛంద సంస్థ లకు (NGO) ప్రభుత్వం అధికార గుర్తింపు ఇవ్వాలి.