సోమవారం వరకు మరమ్మతులు
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):
ఆదిలాబాద్
జిల్లా కేంద్రం లోని రిమ్స్ వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు తెలంగాణ
రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రన్ని ఈ
నెల 9న
ప్రారంభించారు. ప్రారంభించిన కొన్ని రోజులకే
బయో కెమిస్ట్రీ పరికరం, తో పాటు జనరేటర్ చెడిపోవడం జరిగింది.ల్యాబ్ లో లేటెస్ట్
టెక్నాలజీ పరంగా కొత్త కొత్త పరికరాలు రావడంతో సిబ్బందికి కొన్ని రకాల ఇబ్బందులు
తప్పలేదు. గత మూడు నెలలుగా ట్రయల్ వెర్షన్ లో అన్ని రకాల టెస్టు చేసినప్పటికీ
ప్రారంభించిన కొన్ని రోజులకే బయో కెమిస్ట్రీ పరికరం చెడిపోవడం జరిగింది.
బయోకెమిస్ట్రీ కి సంబంధించిన అన్ని రకాల టెస్ట్ లు చేయలేకపోతున్నారు సిబ్బంది. లిపిడ్ ప్రొఫైల్ ,లివర్
ప్రొఫైల్, షుగర్ ప్రొఫైల్, కిడ్నీ ప్రొఫైల్ టెస్టులు ఆగిపోయాయి.సంబంధించిన టెస్ట్ అన్ని నిలిచిపోవడంతో రోగులకు కొద్దిపాటి
ఇబ్బందులు తప్పడం లేదు. చెడిపోయిన పరికరం తిరిగి అధికారులు తెప్పించారు. కానీ మరమ్మతుల కోసం మాత్రం ముంబాయి
నుంచి రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే తెలంగాణ డయాగ్నొస్టిక్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు
చేసిన జనరేటర్ కూడా సక్రమంగా పనిచేయడం లేదు. కరెంటు
సక్రమంగా లేకపోవడం రావటం పోవటం జరగడం వల్లనే బయోమెడికల్ పరికరం చెడి పోయినట్లు
తెలుస్తోంది.
తొందరలోనే టెస్ట్ లు జరుగుతాయి
తెలంగాణ
రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం ఇన్చార్జ్
డాక్టర్ సాదన
బయో మెడికల్
టెస్ట్ లకు సంబంధించిన మిషన్ ప్రాబ్లం రావడం వల్ల దానికి సంబంధించిన పరికరాన్నితెప్పించడం
జరిగిందని తొందరలోనే టెస్ట్ లు జరుగుతాయని డిప్యూటీ
డిఎంఅండ్హెచ్ఓ తెలంగాణ డయాగ్నొస్టిక్ ఇన్చార్జ్ డాక్టర్ సాదన ఆరోగ్యజ్యోతికి తెలిపారు . లిపిడ్ ప్రొఫైల్
,లివర్ ప్రొఫైల్, షుగర్ ప్రొఫైల్, కిడ్నీ ప్రొఫైల్ టెస్టులు ఆగిపోయాని తెలిపినారు.సోమవారం
రోజు టెక్నీషియన్ మరమ్మతులు చేపడతారని తెలిపారు. జనరేటర్ కు సంబంధించిన సమస్య
పరిష్కరించబడింది అని పేర్కొన్నారు.