వరంగల్ అర్బన్(ఆరోగ్యజ్యోతి)
: వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక
ఆధ్వర్యంలో వరంగల్ (ఎం.జీ.ఎం.)
సుపరడెంట్ డాక్టర్ వెలుపదాసు చంద్రశేఖర్ ని కలిసిన వినతి పత్రము ఇవ్వడం జరిగినది. ఈ
కార్యక్రమం లో రాష్ట్ర ఐక్యవేదిక నాయకులు బత్తిని సుదర్శన్ గౌడ్ , స్టేట్ కోరో కమిటీ సబ్యులు రామ రాజేష్ ఖన్నా , డా. నాగ శశికాంత్ , డా. మహేందర్, యధానాయక్, బానోత్ నెహ్రూ చంద్, జిల్లా ఐక్యవేదిక నాయకులు ఓ. సందీప్ కుమార్, ఏ. వెంకటేశ్వర్ వర్మ, రేవూరి ప్రకాష్ రెడ్డి, సుధాకర్, జి. వీరేందర్ నాయక్, కోట అరుణ, పి. మంజుల, శైలజ, అహ్మదుల్లా ఖాన్, వెంకట రమణ, అనిశెట్టి రమేష్ , శ్రీనివాస్, ఆకుల కుమార్, దేవి, విజయలక్ష్మి అన్ని సంఘాల నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక డిమాండ్స్ .....
Ø వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అన్ని స్థాయిల్లోని
అన్నిరకాల క్యాడర్స్ ఉద్యోగుల కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా వెంటనే
వ్యాక్సినేషన్ చేయాలని కోరుతున్నాం..
Ø కోవిడ్- 19 కి గురైన వైద్య ఆరోగ్య ఉద్యోగులందరికీ ప్రభుత్వ
ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆక్సిజన్తో కూడిన 10% బెడ్స్ ప్రత్యేకంగా కేటాయించే విధంగా
చర్యలు తీసుకోవాలి.
Ø కోవిడ్- 19 కి గురైన వైద్య ఆరోగ్య సిబ్బంది కుటుంబ సభ్యులకు
జిల్లా కేంద్రాలు పట్టణ కేంద్రాల్లో ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి.
Ø కరోనా బారిన పడి మృతి చెందిన వారికి కేంద్రం ఇచ్చే రూ
50లక్షల ఇన్సూరెన్స్తో పాటు రాష్ట్ర కేంద్రం కూడా రూ 50 లక్షలు ఎక్స్ప్రెషియా
ఇవ్వాలి. వారి కుటుంబ సభ్యులలో అర్హతను బట్టి చనిపోయిన ఉగ్యోగి స్థాయికి తగ్గకుండా
ఉద్యోగం ఇవ్వాలి.
Ø కరోనా ఇన్సెంటీవ్ 2020 ఏప్రిల్ మే నెలలు మాత్రమే 10%
ఇచ్చారు. ఆ తరువాత కాలంలో ఇవ్వలేదు. దానిని కొనసాగించి వైద్య ఆరోగ్య
ఉద్యోగులందరికీ ఇవ్వాలి.
Ø ఉద్యోగులపై పనిభారం తగ్గించడానికి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. ఉదా: టిఎస్పిఎస్సి ద్వారా 2017 నోటిఫికేషన్లో సెలక్ట్ అయినవారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి.