జిల్లా కలెక్టర్
సిక్త పట్నాయక్
ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): జిల్లాలో కోవిడ్ వ్యాప్తి నిరోధకానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు కోవిడ్ పరీక్షలు వ్యాక్సినేషన్ అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ పట్నాయక్ అన్నారు .శనివారంనాడు తన క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి సర్వే ద్వారా మూడు విడతల్లో 92307 గృహాలలో సర్వే నిర్వహించగా, 9582 మందికి లక్షణాలు కలిగినవారిని గుర్తించడం జరిగిందన్నారు. గుర్తించిన వారికి హోమ్ కిట్స్ పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు . జిల్లా సరిహద్దుల్లోని దోలార, కోబ్బాయి లక్ష్మిపుర్, గన్పూర్, ఏర్పాటు చేసి 7266 మందికి స్క్రీనింగ్ చేయడం జరిగిందన్నారు. ఇందులో 82 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించామని 39 మందికి కరోన పరిక్షలు నిర్వహించగా నెగిటివ్గా తేలిందని తెలిపారు .జిల్లాలో 16169పాజిటివ్ కేసులు వచ్చాయని, ఇందులో 15938మందికి కోవిడ్ నుంచి కోరుకున్నారని తెలిపారు. కోవిడ్ వలన 83 మంది మరణించారని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రిలో 591 ఐ.సి.యు లో అందుబాటులో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. కేంద్రాల్లో 322 బెడ్లు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. జిల్లాలో వివిధ వర్గాల 69960 మందికి వ్యాక్సిన్ అందించడం జరిగిందన్నారు. ఇందులో 51582 మందికి మొదటి డోసు 18378 మందికి రెండవ దోస్త్ దోస్త్ అందించడం జరిగిందన్నారు. జిల్లా లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ మరింత జాగ్రత్త ఉండేవిధంగా విస్తృత ప్రచారం చేయాలన్నారు .ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యం డేవిడ్ ,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బలరాం ,అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాదన, జిల్లా సర్విలేన్స్ అధికారి డాక్టర్ వై సి శ్రీనివాస్ ,జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, టి టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.