ఎన్ఆర్హెచ్ఎం ఉద్యోగులకు పిఆర్సి వర్తింపచేయాలి

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

మంచిర్యాల్, వేములపల్లి,(ఆరోగ్యజ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని వర్తింపజేయాలని శనివారం నాడు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వేములపల్లి లో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం అన్యాయం జరిగిందన్నారు.  వెంటనే వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. గతంలో 510 జీవో ప్రకారం ఎనిమిది వేల మందికి వేతనాలు పెంచాలని మరో 4 వేల మందికి వేతనాలు పెంచకపోగా వల్ల చాలీచాలని వేతనాలతో జీవనం కొనసాగిస్తున్నారు. 4వేల మందికి వెంటనే వేతనాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎం లు మంజుల, ఉమాదేవి, కళావతి , హెల్త్ అసి్టెంట్ లింగయ్య, డీ ఈ వో శివ ప్రసాద్ , కాంజినెంట్ వర్కర్స్ బాపు , లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.