కామన్ సర్వీస్ సెంటర్ల సేవలను వినియోగించుకోవాలి

కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

తలమడుగు,ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): కామన్ సర్వీస్ సెంటర్ల సేవలను వినియోగించుకోవాలని తలమడుగు జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి అన్నారు. రుయ్యడి గ్రామం లోని కామన్ సర్వీస్ సెంటర్ లో హెచ్.పీ గ్యాస్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి హెచ్.పీ గ్యాస్ వచ్చిందని ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఆన్లైన్ సేవలు పాన్ కార్డ్, రీఛార్జ్ విద్యుత్ బిల్లు తదితర వందలాది సేవలు కామన్ సర్వీస్ సెంటర్ లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కామన్ సర్వీస్ సెంటర్ జిల్లా మేనేజర్ రాహుల్, సి ఎస్ సి నిర్వాహకులు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు