మహబూబాబాద్,(ఆరోగ్యజ్యోతి): టిబి పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని టిబి అల్
ఆఫ్ ఇండియా, బిటిబి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో
గంగారం మండలం కోమట్ల గూడెం లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టి పీ
కోఆర్డినేటర్ వెంకట్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు టిబి పై
అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. రెండు వారాల కంటే ఎక్కువగా దగ్గు
ఉంటే రావడం ,బరువు తగ్గటం, అనారోగ్య
లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ జిల్లా ప్రభుత్వ
ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.టిబి వచ్చిందని భయపడవలసిన
అవసరం లేదని మూడు నుంచి ఆరు నెలల్లో టీవీ తగ్గుముఖం పడుతుంది అన్నారు. ఈ
కార్యక్రమంలో లో మహిళా సంఘాలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.