కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
కనిపించే
దేవుళ్లే వైద్యులు వైద్య సిబ్బంది
ఎం ఎల్ ఏ
నిధులతో పి.హెచ్.సి అభివృద్ధి
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
తలమడుగు,ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): తలమడుగు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేయడం పేద గిరిజన
బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక వరమని బోథ్ శాసనసభ్యులు రాతోద్ బాబురావు అన్నారు. ఆదివారం
నాడు తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్ ని బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు, జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి ,ఎం పి టి సి కళ్యాణం లక్ష్మీ
రాజేశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, తలమడుగు
గ్రామ సర్పంచ్ కల్యం కరుణాకర్ రెడ్డి లతో
కలసి అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బోథ్
శాసనసభ్యులు మాట్లాడుతూ తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎంతో పేరు ఉందన్నారు .ఈ
ఆసుపత్రి నిర్మించి దాదాపు 70 సంవత్సరాల పూర్తవుతుందని తెలిపారు. ఆసుపత్రిలో అన్ని
రకాల వైద్య సౌకర్యాలు అందించాలని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల
ఆరోగ్య కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఇందులోభాగంగానే ప్రాథమిక ఆరోగ్య
కేంద్రానికి అల్ట్రాసౌండ్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కరోనా సమయంలో
కనిపించే దేవుడు గా పనిచేసిన వైద్య సిబ్బంది కి ప్రజలంతా రుణపడి ఉన్నారని ఈ
సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరి గోడ, ఆపరేషన్
థియేటర్ మరమత్తులు, ఆసుపత్రి ఆవరణలో సేడ్ నిర్మాణం కొరకు తమ నిధులు సమకూర్చి మరమ్మత్తులు చేస్తానని ఈ
సందర్భంగా ఆయన తెలిపారు. బోథ్ నియోజకవర్గం లోని బజార్హత్నూర్ ప్రాథమిక ఆరోగ్య
కేంద్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. గతంలో
భీంపూర్, ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా జాతీయ స్థాయిలో అవార్డు
పొందాయన్నారు. నియోజకవర్గం నుండి మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జాతీయ స్థాయిలో
గుర్తింపు పొందిన వైద్యులు వైద్య సిబ్బంది ఎంత పని చేస్తున్నారని ప్రజలు అర్థం
చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేంద్ర
మాట్లాడుతూ వైద్యం రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రతివారం గర్భిణీ
స్త్రీలందరికీ స్కానింగ్ ద్వారా పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. గర్భిణీ లకు
తొమ్మిది నెలలోగా నాలుగు సార్లు స్కానింగ్ అవసరం పడుతుందని తెలిపారు. నెలకు ఒకసారి
వైద్యులు వస్తారని తెలిపారు .ఇవే కాకుండా కిడ్నీ, లివర్, గర్భకోశ వ్యాధులు కూడా
స్కానింగ్ ద్వారా టెస్ట్ చేయించుకోవచ్చని తెలిపారు, గర్భవతులు ప్రభుత్వాస్పత్రిలో
ప్రసూతి కావాలని తెలిపారు .ప్రభుత్వాస్పత్రిలో వారికి మగ పిల్లవాడు పుడితే 12 వేల
రూపాయలు, ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలతో పాటు కేసీఆర్ కిట్ ఉచితంగా అందించడం
జరుగుతుందని పేర్కొన్నారు. జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రిలో
అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంతో మండల ప్రజలందరికీ సంతోషకరమైన విషయం అన్నారు.
అంతేకాకుండా ఆస్పత్రిలో అల్ట్రా సోనోగ్రఫీ ఏర్పాటు చేయడంతో మండల ప్రజలు ఆదిలాబాద్
వెళ్లవలసిన అవసరం లేదని తెలిపారు .అలాగే ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్. ఇతర పోస్టులు
కూడా భర్తీ చేయాలని ఎమ్మెల్యేకు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కి సూచించారు. ఈ
కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు కళ్యాణలక్ష్మీ రాజేశ్వర్, మండల తాసిల్దార్
ఇమ్రాన్ ఖాన్ ,ఎంపీడీవో రమాకాంత్ ,స్థానిక సర్పంచ్ కరుణాకర్ రెడ్డి ,ఎంపీటీసీ చంటి,
మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్
రాహుల్, తలమడుగు మండలం మహిళ ఉపాధ్యక్షురాలు ఎంపిటిసిలు సర్పంచ్లు తదితరులు
పాల్గొన్నారు.
సేవలకు గుర్తింపు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వైద్య సేవలు అందించిన మెడికల్
పారామెడికల్ సిబ్బందిని గుర్తించి బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు జిల్లా వైద్య
ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి మండల
పరిషత్ అధ్యక్షురాలు కళ్యాణ లక్ష్మీ రాజేశ్వర్ శాలువతో వైద్యాధికారి డాక్టర్
రాహుల్, తో పాటు పి హెచ్ ఎం సత్యవతి, హెచ్ ఇ ఓ చిన్నన్న
,సూపర్వైజర్ శకుంతల, ఎహ్ఎ రాధాకృష్ణ ,ఫార్మసిస్ట్
శైలజ, స్టాఫ్ నర్స్ సంగీత.. యుడిసి గంగామణి ,ఏఎన్ఎంలు అడేల్లమ్మ, వెంకటమ్మ, మణి
లతా, టి లక్ష్మి ,కె లక్ష్మి, విజయ, విద్యా లత ,సువర్ణ రేణుక ,వసంత, సుజాత. ఆశా
కార్యకర్తలు లక్ష్మి, గోదావరి, కవిత, అంబాబాయి ,లీల ,లక్ష్మి, సృజన ,సునీత.అటెండర్
జయబాబు కాంట్రాక్ట్ వర్కర్స్ మల్లేష్ రవి లకు సన్మానం చేశారు సన్మానించారు