అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పి ఆర్ సి లో అన్యాయం

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

ములుగు,(ఆరోగ్యజ్యోతి ):పి ఆర్ సి కమిటీ నివేదిక సిఫారసు చేసిన కనీస వేతనం 19 వేల రూపాయలు ఉండగా దానికి భిన్నంగా అధికారులు కేవలం 15 వేల ఆరు వందలు మాత్రమే పిఆర్సి జీవో నెంబర్ 60 లో చేర్చడం విడ్డూరంగా ఉందని, తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ అన్నారు. శనివారం నాడు ములుగు ఆసుపత్రి ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అధికారులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పి ఆర్ సి జీవో నెంబర్ 60 సవరించి ఆరోగ్య శాఖ ఉద్యోగుల న్యాయమైన వేతనం ఇచ్చి అధికారులు ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతన వేతన సవరణ కమిషన్ 50 నుంచి 60 శాతం పెంచాలని ప్రభుత్వం మాత్రం 30 శాతం పెంచుతూ జీవో ఇవ్వడం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను గురి చేసిందన్నారు. వేతనం టెంపుల్ లో వ్యత్యాసం కనిపిస్తుంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు 2016 సంవత్సరం లోనే 3 సబ్ చేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు కంటికి కునుకు లేకుండా కరుణ విధులు నిర్వహించి నా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా సోకిన లక్షలాది రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేశారని అప్పుల బాధలు అలమటిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.