కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
ఖమ్మం,(ఆరోగ్యజ్యోతి): దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు.. ఆసుపత్రికి చేరకుండానే ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇటు కోవిడ్ బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఇదే క్రమంలో బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే మొబైల్ ఐసీయూ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం ఖమ్మం రోటరీ నగర్ లో ప్రారంభించారు. తొలి విడుత రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభించినట్లు లార్డ్స్ చర్చి ప్రతినిధులు అబ్రహం, రమేష్ లు వెల్లడించారు. అందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు 2 బస్సులను కేటాయించమని, వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్ చర్చి ఈ ప్రాజెక్టును ప్రారంభించిందని వివరించారు.మెడికల్ యూనిట్ బస్సులో వైద్య సేవల కోసం ఒక ల్యాబ్, ఒక డాక్టర్, ఇద్దరు నర్సులతో పాటు ఆక్సిజన్ తో కూడిన 10 బెడ్లు ఏసి సౌకర్యంతో అందుబాటులో ఉంటాయని వారు మంత్రికి వివరించారు.. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. మెడికల్ మొబైల్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చికి మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో మెడికల్ యూనిట్ బస్సుల ప్రారంభం సంతోషంగా ఉందన్నారు. కోవిడ్ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం అందరికీ తెలిసిందన్నారు. దేవుడితో సమానంగా హెల్త్‌కేర్ వర్కర్లను చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో కోవిడ్ సేవలలో భాగస్వామ్యం అయినందుకు వారిని అభినందించారు.బస్సులను ప్రారంభించిన అనంతరం బస్సులో ఉన్న వైద్య సదుపాయాలను మంత్రి పువ్వాడ పరిశీలించారు.కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ , DMHO మాలతి సందీప్, పాస్టర్ సత్యపాల్ కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.