రాష్ట్ర వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  984802545

సంగారెడ్డి,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్  అదనపు కలెక్టర్ ,జిల్లా వైద్యాధికారిని కలిసి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలపై  వినతి పత్రం అందించడం జరిగిందిఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు భరత్ సత్యనారాయణ, డాక్టర్ మజీద్ , డాక్టర్ రాజకుమార్ , డాక్టర్ రాజేశ్వేర్ , శ్రీవాణీ, P ఉమకంత్, శ్రీనివాస, J భాస్కర, కమల  లు మాట్లాడ్డుతూ  తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో వైద్యులుపారామెడికల్ సిబ్బందివివిధ కేంద్ర & రాష్ట్ర పథకాల ఉద్యోగులుఆశా కార్యకర్తల వరకు సుమారు లక్షకు పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. కరోనా మహమ్మారి నియంత్రణకై 2020 మార్చి నుండి నేటి వరకు 16 నెలలుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. సుమారు 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది సిబ్బంది కరోనాకు గురై కుటుంబాలతో సహా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది కాలంగా పారామెడికల్ సిబ్బందిఆశ వర్కర్లు నిరంతరం కరోనాతో పోరాడుతున్నారని తెలిపారు. సుమారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది ఆశ వర్కర్లు ప్రాణాలు కోల్పోయారని వందలాది మంది వైద్య ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు కరోనా వ్యాధికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం జాయింట్  యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అన్ని సంఘాల సమన్వయంతో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడం కోసం జేఏసీగా ఏర్పడం జరిగిందన్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న అన్ని స్థాయిలో పనిచేసే సిబ్బంది కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా కోవిద్ వ్యాక్సినేషన్ చేయాలన్నారు. కరోనా బారిన పడ్డ వైద్య ఉద్యోగులందరికీ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ తో కూడిన 10 శాతం ప్రత్యేక బెడ్ లను సమకూర్చాలి అన్నారు. సిబ్బందికి కరోనా సోకితే నిమ్స్ లో డాక్టర్లకు కేటాయించిన మాదిరిగా పారామెడికల్ సిబ్బంది కి అవకాశం కల్పించాలని కోరారు. అలాగే వైద్య ఉద్యోగుల  కుటుంబ సభ్యులకు జిల్లా కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. కరోనా వ్యాధి న పడి మృతి చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ 50 లక్షల ఇన్సూరెన్స్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. కరోనా వ్యాధికి గురై మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులలో అర్హతకు తగ్గ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.