కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 984802545
క్యాన్సర్ వ్యాధితో పోరాటం - సామాజిక సేవలో ముందు
బోథ్, ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఈ రోజుల్లో మనకు ఏదైనా వ్యాధి ఉందంటే మనం
భయాందోళనలకు గురై మంచం పడతాము.. సాధారణ తలనొప్పి నుండి పెద్ద రోగాల వరకు ఏదీ వచ్చిన
మనం మానసికంగా కుంగిపోతాము.. తనకు క్యాన్సర్ ఉందని తెలిసికూడా ప్రజలకు సేవ చేయాలనే
అంకితభావంతో పనిచేస్తున్న వీర వనిత శారద. ...అనారోగ్యం కారణం చేత ఎలాంటి విశ్రాంతి
తీసుకోకుండా ప్రజాసేవకే ఆమె అంకితమయ్యారు. బోథ్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య
కార్యకర్తగా పనిచేస్తున్న శారదకు 2020 జనవరిలో క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. తనకు
క్యాన్సర్ ఉందని మంచం పట్టలేదు. ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో ధైర్యసాహసాలతో
విధులు ముఖ్యమని ప్రజలకు సేవ చేస్తుంది.వీరవనిత శారద. గత కొంతకాలంగా బోథ్ సామాజిక
ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎం గా శారదా పనిచేస్తుంది . గత కొంత కాలంగా క్యాన్సర్ కు
గురైన ఆమె అయినప్పటికీ యధావిధిగా విధులు
నిర్వహిస్తున్నారు.ఈ విషయమై బోథ్ సామాజిక ఆరోగ్య కేంద్రం
సూపరిండెంట్ డాక్టర్ ప్రసాద్ ను అడగగా అంకితభావంతో పనిచేస్తున్న శారదకు ఆయన
కృతజ్ఞతలు తెలిపారు. ఏదైనా వ్యాధుల బారిన పడ్డవారు ఇంట్లో కూర్చుని ఉంటే మానసికంగా
కుంగిపోయి మరింత అనారోగ్యానికి గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
శారద క్యాన్సర్ ఉందని తెలిసి కూడా ఆమె విధులు నిర్వహిస్తూ ప్రజా సేవ చేస్తుందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు.