కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే కోనప్పకు, డి ఎం అండ్ హెచ్ ఓ కి వినతి పత్రం
ఆసిఫాబాద్,(ఆరోగ్య జ్యోతి): ఏఎన్ఎంలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లా పరిషత్ చైర్మన్ కోవా లక్ష్మీ కి, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకి, ఆసిఫాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కుమ్రేబాలు లకు, తెలంగాణ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ సెంట్రల్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామగిరి ప్రవీణ్ సెకండ్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ సెంట్రల్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామగిరి ప్రవీణ్ మాట్లాడుతూ రెండవ ఏఎన్ఎంలు చాలీచాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీరికి పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రోజు రోజుకు పని భారం పెరుగుతుందని ప్రభుత్వం వెంటనే పని భారాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆన్ లైన్ వర్క్ విపరీతంగా పెరుగుతుందని ప్రభుత్వం ఇచ్చిన టాప్ లో సిగ్నల్ సరిగా రాక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏఎన్ఎంలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను వారు కోరారు. ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం అని చెప్తుందని, కానీ ఇంతవరకు అమలు చేయలేదన్నారు .ప్రభుత్వం వెంటనే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. పని భారం పెరగడం వల్ల రెండవ ఏఎన్ఎం అనారోగ్యానికి గురై అనేకరకాల అవస్థలు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే గుర్తించి పర్మినెంట్ చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో భాగ్య, రజిని, పుణ్యబాయీ, లలిత ,శ్రీదేవి , పేంటుబాయీ, జహీ, మీనా, లక్ష్మి ,సునీత, శైలజ,తిరుమల, పద్మ, శారద, జ్యోతి, మంజుల, మేఘన,సునీత, బుజ్జి,రాధా తదితరులు పాల్గొన్నారు.