ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):నేషనల్
హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న వైద్య ఉద్యోగులకు పి ఆర్ సి లో
వేతనాలు పెంచాలని పట్టణ ప్రాథమిక ఆరోగ్య
కేంద్రాల సిబ్బంది నల్ల బడ్జీలతో నిరసన తెలియజేస్తూ విధులు నిర్వహించినారు. ఈ
సందర్భంగా మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో కీలక
పాత్ర పోషిస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెరగకపోవడం భాదాకరమైన విషయం అన్నారు.నేషనల్
హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) చాలా వరకు కేటగిరీల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న అన్ని కేటగిరి
ఉద్యోగులకు 30 శాతం పిఆర్సి వర్తింప
చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్, డాక్టర్ కిరణ్ ,డాక్టర్ శిల్ప, డాక్టర్ శ్రీనివాస్, స్టాఫ్ నర్సులు నీల, సుజాత ,కల్పన, లీల, విజయ రాణి, సాయి చందర్, డి ఈ ఓ లు శృతి, కమ్యూనిటీ ఆర్గనైజర్లు నవీన్ ,రాజారెడ్డి ,ప్రశాంత్ ,పార్మసిస్ట్ తేజస్విని, ఏ ఎన్ ఎం లు అన్నపూర్ణ, విజయలక్ష్మి, ఇర్ఫాన్ ,సబ్ ఆర్డినేటర్లు స్వామి, దత్తు, సంగీత తదితరులు పాల్గొన్నారు.