టీవీ పై అవగాహన కార్యక్రమం

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

మహబూబ్ నగర్,గూడూరు,( ఆరోగ్యజ్యోతి):  క్షయ వ్యాధి నివారణ జాగ్రత్తల గురించి టి బి అల్ ఆఫ్ ఇండియా బి టి బి ప్రాజెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆ సంస్థ కోఆర్డినేటర్ వెంకట్ మాట్లాడుతూ క్షయ వ్యాధి  వచ్చిందని భయపడవలసిన అవసరం లేదన్నారు. వచ్చిన వారిలో చికిత్స ద్వారా మూడు నుంచి ఆరు నెలల్లో తగ్గు ముఖం పడుతుంది అన్నారు. క్షయ వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు దగ్గు తెమడ బరువు తగ్గడం రాత్రిపూట చెమటలు పట్టడం నొప్పి ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చాలా మంది క్షయ వ్యాధి అంటే భయపడతారని కానీ టీవీ వస్తే భయపడవలసిన అవసరం లేదన్నారు క్రమం తప్పకుండా మాత్రలు తీసుకుంటే వెంటనే తగ్గుతుంది అన్నారు . అనంతరం  క్షయ  రోగులకు పోషకాహార పంపిణీ చేశారు .ఇతర వస్తువులను వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మంకయ్య , పి హెచ్ ఎం కోమల ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.