ఆదిలాబాద్ , (ఆరోగ్యజ్యోతి): సూపర్ స్పెషలిటి ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ నియామకాలకు దరఖాస్తులు తీసుకుంటున్న నేపథ్యంలో పారదర్శకత పాటించాలని ఏజెన్సీ ప్రతినిధులను హెచ్చరించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారు, రిమ్స్ లో స్టాఫ్ నర్స్, లాబీటెక్నీషియన్, రేడియాలజీ, ప్లంబర్ ఎలక్ట్రికల్, బయబర్ వంటి పలు పోస్టులకు రిమ్స్ అధికారులు ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియామకాలకు దరఖాస్తులు తీసుకుంటున్నారు, దరఖాస్తు చేసుకున్న పలువురు నిరుద్యోగులు అక్కడ తీసుకున్న దరఖాస్తులకు కనీసం రిసీవ్డ్ రిషిప్ట్ కూడా ఇవ్వట్లేదు చిన్న గదిలో వందల మంది నిరుద్యోగులు గుమిగూడిన విషయం జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారికి వివరించారు. వెంటనే స్పందించిన జిలా అధ్యక్షులు అక్కడికి చేరుకొని ఏజెన్సీ ప్రతినిధులను ఎటువంటి గందరగోళం జరగకుండా నియామకాలు జరగాలని హెచ్చరించారు.